ప్రొద్దుటూరు :నూతనంగా జగనన్న కాలనీ నిర్మాణం లో నాణ్యత లేదని,
రాజకీయం ఉనికి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రవీణ్ అని 32 వార్డు కౌన్సిలర్ భూమి రెడ్డి వంశీధర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బొల్లవరంలోని జగనన్న లే అవుట్ లో గురువారం టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి జగనన్న ఇళ్లు నాణ్యత లోపించాయని, 2 సెంట్లు అని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారని, కానీ అక్కడ దాదాపు 1300 ఇళ్లు నిర్మిస్తున్నది టిడిపి నాయకులు మునిశేఖర్ రెడ్డి అని, ఆయనను తాము సంప్రదించగా కేవలం ప్రవీణ్ రాజకీయాల కోసమే ఈ విధంగా వ్యవహరించారని తెలిపారని వివరించారు. ఆ సందర్శనకు వెళ్లిన వారంతా కేవలం టిడిపి నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులే అని, లబ్ధిదారులు చాలా తక్కువ సంఖ్యలో వున్నారని ఆరోపించారు. ఇటీవలే ప్రవీణ్ కు టిడిపి టికెట్ లేదని తెలిసిందని, కావున ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు.