జే. బి.వి.యస్. ది ప్రిజర్వర్ సేవ సమితి
కడప అర్బన్
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రక్తం దొరకడం ఎంతో కష్టంగా ఉందని యువత సేవా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడంలో సహాయం చేయాలని ముఖ్య అతిథిగా విచ్చేసిన నెహ్రూ యువ కేంద్ర డిస్టిక్ యూత్ ఆఫీసర్ మణికంఠ అన్నారు. జే.బి.వి.యస్. ది ప్రిజర్వర్ సేవ సమితి అధ్వర్యంలో ప్రాజెక్ట్ ఔషధ సమర్పణలో భాగంగా కడప నగరం లోని స్థానిక నాగార్జున మహిళ డిగ్రీ కళాశాల మరియు కడప యూత్ హాస్టల్ నందు ఒకేసారి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్ మరియు సంస్థ వ్యవస్థాపకుడు అయిన ఎం అశోక్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిలో రక్తం ఎంతో అవసరం పడుతుందని అన్నారు.ఈ రక్తదాన శిబిరంలో అబ్బాయిలే కాకుండా 20 మందికి పైగా నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన అమ్మాయిలు రక్తదానం చేయడం తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన విద్యార్థినీ విద్యార్థులకు నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రక్తదాన శిబిరాలకు కలిపి 55 యూనిట్లు పైగా కలెక్ట్ చేసినందుకు రిమ్స్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సుబ్బ నరసయ్య,రిమ్స్ సిబ్బంది,మరియు సంస్థ సభ్యులైన అయిషా,ప్రియా,మహిత, సులమాన్,యుగంధర్,మునివర్ధన్ మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.