Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుయాత్ర 2 చిత్రానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు :ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి

యాత్ర 2 చిత్రానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు :ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి

పోరుమామిళ్ల:
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ ‘యాత్ర 2’ స్పెషల్ ప్రదర్శన పోరుమామిళ్ల పట్టణంలోని దేశాయిథియేటర్లో గురువారం ఉదయం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ప్రత్యేక ప్రదర్శనలో మూవీని వీక్షించారు. ముందుగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి థియేటర్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మూవీని వీక్షించిన అనంతరం కేక్ కట్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాడ్లాడుతూ వైఎస్సార్‌ తనయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయమన్నారు. రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన యాత్ర-1కు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. మహానేత మనందరికీ దూర మయ్యాక రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను యాత్ర-2లో అద్భుతంగా తెరకెక్కించారని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే అసలైన రాజకీయమని సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుకెళ్లారని అదే ఈ సినిమాలో చూపించారన్నారు. చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు థియేటర్ వద్ద బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమణ రెడ్డి, ఆప్కాస్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్త, మండల కన్వీనర్ మరియు వైస్ ఎంపీపీ సి.భాషా, పోరుమామిళ్ల ఉప సర్పంచ్ రాళ్లపల్లి రవికుమార్, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ రాజశేఖర్, అల్లా, నరసింహులు, యూత్ అధ్యక్షులు చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి, విద్యార్థి విభాగం మరియు డీసీ యువసేన అధ్యక్షులు చాపాటి సాయి నారాయణ రెడ్డి, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, అభిమానులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article