నెత్తకుప్పం నుంచి జోరుగా వలసలు
రామచంద్రపురం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం లేదని మేమంతా… పులివర్తి నాని వెంటే నడుస్తామని రామచంద్రాపురం మండలం, నేత్తకుప్పం పంచాయతీ యల్ వి పురం(కట్ల కనం) గ్రామానికి చెందిన వైసీపీ నేతలు అన్నారు. బుధవారం తిరుపతి రూరల్ మండలం, రఘునాథ్ రిసార్ట్స్ లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో వైసీపీ నాయకులు భార్గవి, నాగమణి, సంపూర్ణమ్మ, పద్మ, గౌరమ్మ, వెంకటమ్మ, గోవిందమ్మ, గురమ్మ, అమ్మనెమ్మ, జ్ఞానమ్మ, ధర్మ రెడ్డి, ధన లక్ష్మి, రాజమ్మ, ముని లక్ష్మి, గీత, సాకేలే, సుమతి, కృష్ణయ్య, బుచ్చి రెడ్డి, సావిత్రమ్మ, దేవి, అరుణాధ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రజలనే కాకుండా సొంత క్యాడర్ ను కూడా రెండు సార్లు మోసం చేశారని పార్టీలో చేరిన వారన్నారు. పంచాయితీలో టీడీపీకి మెజార్టీ తీసుకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

