కనిగిరి
కనిగిరి మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధికి చేసేందుకు సహకరించాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు.
గురువారం తాడేపల్లిలోని పురపాలక శాఖ కార్యాలయంలో మంత్రివర్యులు డాక్టర్ ఆదిములపు సురేష్ గారిని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మర్యాద పూర్వకంగానూ కలిశారు.
ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పనులకు కాంట్రాక్టర్లకు పాత బిల్లులను సకాలంలో చెల్లించేందుకు సహకరించాలని లక్షలు పెట్టి ప్రభుత్వం చేపట్టిన పనులు చేయడం జరిగింది. ఆ పనులు బిల్లులు సకాలంలో రాక వడ్డీలకు మరింత భారం ఏర్పడుతుంది.కాంట్రాక్టర్స్ కు రావాల్సిన పాత బిల్లులు సకాలంలో చేయాలని మంత్రివర్యులు సురేష్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించి పాత బిల్లులను పునరుద్దీకరించుటకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.మున్సిపాలిటీకి మంజూరైన నిధులతో పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు కృషీ చేస్తానని ఆయన అన్నారు.