గాజువాక:రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గాజువాక నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చెయ్యాలని, తిప్పల నాగిరెడ్డి గారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శాసనమండలి సభ్యునిగా నియమిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి గారు గాజువాకలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వారిలో తిప్పల గురుమూర్తి రెడ్డి, తిప్పల వంశీ రెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, జీలకర్ర నాగేంద్ర ఉన్నారు.