సిఎం వైఎస్ జగన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల :ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాళ్లదాడి చేయ డం పిరికిపందల చర్యని, ముఖ్యమంత్రి జగన్మోహ న్ రెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఆదివారం పులివెందుల లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూవిజయవాడ లో ఎన్నడు జరగని విధంగా రోడ్ షో నిర్వహిస్తే అది చూసి తట్టుకొలేక కూటమి నాయకులకుకళ్లు కుట్టి ఈర్షతో దాడికి పాల్పడడం ఏమైన చర్య అన్నారు. బస్సు యాత్రకు అటంకం కలిగించేందుకే రౌడీమూ కలతో దాడి చేయించడం చాలా బాధాకరమన్నా రు. విజయవాడలోనే ఇంత భారీ యాత్ర జరగడం అక్కడికి వచ్చిన ప్రజలను చూసి ఓర్వలేకనే దాడి చేయించడం జరిగిందన్నారు.దాడి చేసిన వారు ఎంతటి వారైనా చేయించిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకొవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నుపైన తగిలిన దెబ్బ త్వరగా మానిపోయి ప్రజలలోకి త్వరగా రావాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైకాపా ఇన్చార్జి వైయస్ మనోహర్ రెడ్డి, కౌన్సిలర్ కోడి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి డేనియల్ బాబు, జేసిఎస్ ఇంచార్జ్ పార్నపల్లి కిషోర్, మాజీ కౌన్సిలర్ కోళ్ల భాస్కర్, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ రసూ ల్, కో ఆప్షన్ మెంబర్ దాసర్ చంద్రమౌళి, సోపాల వీర, తదితరు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.