Wednesday, February 4, 2026

Creating liberating content

టాప్ న్యూస్మీది ప్రజాకాంక్షనా ..లేక కామ కాంక్ష నా…?

మీది ప్రజాకాంక్షనా ..లేక కామ కాంక్ష నా…?

ఓరి మీ కామం తగలెయ్యా…!

*మీరున్నది ప్రజాసేవకా… పవళింపు సేవకా…?

*ప్రజలు ఎన్నుకొన్నది ఇందుకోస మేనా…!

*ప్రజా సమస్యల చూడరా అయ్యా అంటే…

*పువ్వుల వాసనలు చూస్తూ ఉంటారా…?

*జనసేనానికే ఎందుకిలా అవుతుంది…

*ఆయనేమో మహిళా పక్షపాతి…

*వీరేమో మహిళా భక్షకులు అవుతుంటే…

*ఆరవ శ్రీధర్ గారు ఈ ఆస్లీల వీడియోలు నిజమేనా…

*కూటమి ప్రభుత్వానికి ఎంత కానీ కాలం వచ్చేనో కదా…

*చంద్రబాబు సమర్ధతకే సవాల్ విసురుతున్నారే..

*మొన్న తిరుపతి జిల్లా,నిన్న శ్రీకాకుళం జిల్లా,నేడు అన్నమయ్య జిల్లా…

*సామాజిక మాధ్యమాలలో పరిచయాలు ..

*చివరికి సంసారాలు వీధి పాలు…

*రాష్ట్ర పరువు బజారు పాలు…

*వీరికెందుకయ్యా ఈ ప్రజాప్రతినిధుల హోదా…

*ఇలాంటి వారు ఏ చట్టాలు రూపకల్పన చేస్తారు ..

*వీరికి ప్రజలతో సంబంధం లేదు…ఆ అవసరం లేకపోయే..

*చీ వీరి బ్రతుకులు చెడ… మీరేమి నాయకులురా అయ్యా…

*అవన్నీ నకిలీ వీడియో లే అంటున్న ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్…

*మా అబ్బాయిని ట్రాప్ చేసిందంటున్న ఎమ్మెల్యే తల్లి ప్రమీల…

*తనని రేప్ చేసి ఏడాదిన్నర కాలం ఐదు అబార్షన్ లు చేయించడంటున్న బాధిత మహిళ..

*విచారణ కమిటీ వేసిన జనసేనాని…

*నిజాలు నిగ్గుతేలుతాయా.. నీరుగారిపోతాయా…

*చంద్రబాబు గారు మీరు చర్యలు తీసుకోవాల్సిందే..

*పవనన్న ఈ పనికి మాలిన పనులపై పటిష్ట చర్యలు తీసుకో అన్న…

*అనితమ్మా ఈ అఘాయిత్యాలను ఆశ్రద్ద చేయకమ్మ…..

*ఈ కామాంధులకు కళ్లెం పడేదెన్నడో…

(రామమోహన్ రెడ్డి)

“ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతలోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం ఆరవవేదం మానభంగపర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్దకాగానే ముద్దుమురిపాలకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిలకామ నీచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం ॥మరో॥ కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి మీ కండలు పెంచినది ఈ గుండెలతో కాదా ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురుజేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా కనబడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర ఏనాడో మీరుంచిన లేతపెదవి ముద్ర ప్రతిభారత సతిమానం చంద్రమతి మాంగల్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవరూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్వం అవుతుంటే ఏమైపోతుంది సభ్యసమాజం ఏమైపోతుంది మానవధర్మం ఏమైపోతుంది ఈ భారతదేశం మన భారతదేశం మన భారతదేశం”ప్రతిఘటన లోని ‘చేదుపాట’.ఇది సమాజంలోని అసమానతలు, మరియు బానిసత్వానికి వ్యతిరేకంగా సామాన్యుడి ఆవేదనను, నిరసనను వ్యక్తం చేస్తుంది. ఇక్కడ నేడు సమాజంలో ప్రజాసేవ అన్న పేరుతో రాజకీయ రంగు పులుముకుని పదవి వ్యామోహం తో ఒళ్ళు కొవ్వెక్కి బరితెగించి ప్రవర్తిస్తున్న అరాచకీయుల ప్రవర్తన తో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు ఈ నీచ రాజకీయాలముసుగులో ఉన్న కొందరు నీచులు. కామా తురాణం న భయం న లజ్జ” కామ వాంఛతో కళ్లు మూసుకుపోయిన వారికి, నియంత్రణ కోల్పోయిన వారికి భయం, సిగ్గు (లజ్జ) ఉండవని దీని అర్థం. అత్యంత బలమైన కామ కోరికల వల్ల మనిషి మంచిచెడులను, పరిణామాలను విస్మరిస్తాడని ఈ సూక్తి తెలియజేస్తుంది. ఇక్కడ అదే జరిగిందని చెప్పాలి.ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధి అంటే దాదాపు రెండు లక్షల పై చిలుక ప్రజలకు సేవకుడై వారి జీవన ప్రమాణాలు పెంపొందించేలా ఉండాలి.కానీ ఒక స్త్రీ ఎమ్మెల్యే అయ్యారని శుభాకాంక్షలు చెప్పగానే సొల్లు గార్చుకుని ఇళ్లు వెతుక్కుంటూ పోయి ఆ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసి అల్లరి పాలు చేసి చివరికి ఈ దేశం ,ఈ ప్రపంచంలో తెలుగునాట రాజకీయ సేవ అంటే ఇదేనా వీరేనా రాజకీయ నాయకులు అన్న అపకీర్తి తెచ్చి పెడుతున్న ఈ నీచ దౌర్భాగ్యపు వారిని ఈ సమాజం ఇంకా ఆదరించాలా అన్న ఆలోచన కలుగుతుంతే ప్రజాస్వామ్య వ్యవస్థ కే అసహ్యం పుడుతుందని చెప్పక తప్పడం లేదు. సృష్టికర్త ఒక బ్రహ్మ ఆ బ్రహ్మను పుట్టించింది ఓ అమ్మ అలాంటి మాతృ మూర్తి కి సమానమైన పరాయి స్త్రీ పట్ల బలుపెక్కి బలాత్కారం చేసారని ఒక స్త్రీ సిగ్గు విడిచి సామాజిక మాధ్యమాలకెక్కిందంటే ఇంతకంటే దారుణమైన ప్రపంచంలో బ్రతుకు తున్నామా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాప్రతినిధి అంటే ప్రజల చేత ఎన్నుకోబడి, వారి తరపున సమస్యలను పరిష్కరించేందుకు, చట్టసభల్లో ప్రజల గొంతుకగా నిలిచే వ్యక్తి. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ వర్గంలోకి వస్తారు, వీరు ప్రజల సమస్యలపై నిలదీస్తూ, అభివృద్ది కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. అయితే నేడు వీరు అవన్నీ మరిచి ప్రజా సేవంటే పవళింపు సేవ, ప్రజాకాంక్ష అంటే వీరి కామ కాంక్ష అన్న అర్దాన్ని పరమార్దన్ని నమ్మి ప్రజల జీవితాలలో తొంగి చూసి వారి మంచి పరిస్థితులు చూడరా అయ్యా అంటే వారి ఇళ్ళల్లోకి దూరి దారి తప్పిన పనులు చేసి మహిళ ల మాన ప్రాణాలను దోచుకుని వారి జీవితాలను నాశనము చేస్తున్న దుర్భర పరిస్థితి తెచ్చి పెట్టి బావి భారత పౌరులకు వీరు ఒక తప్పుడు సంకేతాలు ఇస్తున్న వైనం ఇక్కడ కనిపిస్తుంది. ఇంతకీ ఏమిటా కామ కథ అంటే ఇప్పుడు సామాజిక, ప్రధాన మీడియాలో ఒకటే హడావుడి శ్రీ అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవశ్రీధర్ అస్లీల వీడియోలు, ఆ అస్లీల వీడియో లు విడుదల చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి వీడియో దృశ్యాలు. దీనికి తోడు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే ఇరువర్గాల వఫాబాలు.దీనికి తోడు మీడియా డిబేట్ లు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ఇదే గోల ఇప్పుడు యావత్తు ప్రజానీకం సిగ్గుతో తలదించుకునేలా ఉంది.ఒక వివాహిత తనను బెదిరించి ఏడాదిన్నరగా అనేక మార్లు అత్యాచారం కు పాల్పడి ఐదు సార్లు అబార్షన్ చేయించి పెళ్లి చేసుకుంటానని మోసగించాడని బాధిత మహిళ ఆరోపిస్తుండగ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆ వీడియోలన్ని అబద్ధమని అవన్నీ కావాలని ఫెక్ చేసి తన రాజకీయ భవిష్యత్ పై దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపిస్తుండటం గమనార్హం. ఇక ఎమ్మెల్యే మాతృమూర్తి ప్రమీల ఆ బాధిత మహిళ పై మీడియా వేదికగా అసభ్య పదజాలంతో రెచ్చిపోయింది.ఆ వివాహిత తన కుమారుడిని ఎన్నో రాత్రులు ఫోన్ చేసి నిద్ర లేని రాత్రులు ఇబ్బందులకు గురిచేసి నానా చిత్రహింసలకు గురిచేసిందని అవి చూడలేక రైల్వే కోడూరు పోలీసులను ఆశ్రయించి కేసు కూడా నమోదు చేయించి నట్లు మీడియా వేదికగా చెప్పుకురావడం జరుగుతుంది. కాగా ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీని ఇబ్బందులు గురిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పై క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేసి వారం రోజులలో వివరాలు సేకరించి నిజా నిజాలు నిర్దారించుకొన్న తరువాత తదుపరి చర్యలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. కాగా గత ప్రభత్వం లో గంట అరగంట ,నగ్న వీడియోలు సంచలనం అవ్వగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మొన్న తిరుపతి సత్యవేడు ఎమ్మెల్యే వ్యవహారం ,తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్, సంక్రాంతి సంబరాలలో స్టేజీపై మహిళ డాన్సర్ ల పట్ల ప్రవర్తించిన తీరు మరువక ముందే నేడు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఆశ్లీల వీడియో లు బైటికి రావడం కూటమి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిందని చెప్పాలి.ఈ వ్యవహరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తుందో ఏ మలువు తిరుగుతుందో చూడాలి మరి.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article