** ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష ఎంపిక పై హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి పార్టీ శ్రేణులు.
** మిర్యాల శిరిష ను ఎమ్మెల్యేగా గెలిపించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ గా ఇస్తాం.
** ఉమ్మడి అభ్యర్థి గెలుపుతోనే రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి.

వి.ఆర్.పురం :రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లు బలపరిచిన, టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీష ను గెలిపించి తీరుతామని, హoతకుడి పాలనకు ఇక అంతమేనని, ” రానుంది ప్రజాపాలన” అని స్థానిక జడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి తమ దిమా వ్యక్తం చేశారు. మండల తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి పార్టీలు గురువారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఆచంట శ్రీను, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకల సాయి కృష్ణ, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ముత్యాల రాంబాబు మాట్లాడుతూ హంతకుడు పాలనకు ఇక అంతమే రానున్నదనీ ప్రజాపాలనని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఉమ్మడి అభ్యర్థిని రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మిరియాల శిరీష కి టికెట్ ఇవ్వడం పట్ల, ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక జడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో మిరియాల శిరీష దేవుని ఎమ్మెల్యేగా గెలిపించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ గా ఇస్తామని, నియోజకవర్గంలో హంతకుడి పాలనలో ప్రజలు అనేక విధాల ఇబ్బందులకు గురవుతున్నారని, రంపచోడవరం నియోజకవర్గంలో అభివృద్ధి లేకుండా పోయిందని, రహదారులు లేక ప్రజలు అనేక విధాల ఇబ్బందులకు గురవుతున్నారని, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభివృద్ధిని గాలికి వదిలేసి, వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తప్పా అభివృద్ధి చేసిన జాడలేదని, శిలాఫలకాలకే అభివృద్ధి పరిమితమైంది తప్పా, అభివృద్ధి చేసిన జాడ లేదని అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఒక్కసారి ఉమ్మడి అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉమ్మడి అభ్యర్థి గెలుపుతోనే రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి మలుపు అని, గెలిచేది మా ఉమ్మడి అభ్యర్థినే అని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ మండల కార్యదర్శి బురక కన్నారావు, రంపచోడవరం నియోజకవర్గం వాణిజ్య విభాగ అధ్యక్షులు బీరక సూర్యప్రకాశ రావు, మాజీ సొసైటీ అధ్యక్షులు ముత్యాల చంద్రశేఖర్, ఐటీడీపీ మండల కన్వీనర్ ముత్యాల సిద్దు, ఐ టి డి పి మండల కోశాధికారి పెందుర్తి సుదర్శన్ రావు, బూత్ కన్వీనర్ రేవు సింహాచలం, రాష్ట్ర ఎస్టీ సేల్ కార్యదర్శి సవలం రాజేంద్రప్రసాద్, మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు బాగుల ప్రమీల, సీనియర్ నాయకులు కనుగుల శ్రీనివాస రెడ్డి, మండల బిజెపి పార్టీ ఓబీసీ మోర్చా కడుపు వెంకటరమణ, కడుపు రాజు తదితరులు పాల్గొన్నారు.