వి.ఆర్.పురం
రేఖపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులూ మామిడి వెంకటరమణ జ్ఞాపకార్థం, మండల కేంద్రం రేఖపల్లి గ్రామంలో సోమవారం వారి సోదరులు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులూ మామిడి రాజు, మామిడి వెంకటేశ్వరరావు, వారి కుమారులు, మామిడి పున్నెశ్వరరావు, మామిడి బాలాజీ, మామిడి గంగాధర్ అధ్వర్యంలో సోమవారం వృద్దులకు రగ్గులు వారు అందచేశారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి రాజు మాట్లాడుతూ అనతి కాలంలోనే మండల వ్యాప్తంగా ప్రజల నుండి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని, వారి యొక్క సేవలను ఆయన గుర్తు చేశారు. ఏ కార్యకర్తకు ఆపదొచ్చిన క్షణాల్లో వారి సమస్యల పరిష్కారానికి రాత్రనక పగలనక శ్రమించారని కొనియాడారు. స్వర్గీయ మామిడి వెంకట రమణ ఆశయ సిద్ది కోసం కార్యకర్తలు రానున్న కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైకాపా సీనియర్ నాయకులు మామిడి రాజు పిలుపునిచ్చారు.