పిల్లల ప్రవర్తనలో అనుమానస్పద మార్పులు ఉంటె దయచేసి పోలీసులకు తెలపండి..!
అధికారులతో ఫోను ద్వారా సంప్రదించిన ఎమ్మెల్యే పులివర్తి నాని..
చంద్రగిరి:
పిల్లలలో అనుకోని అనుమానస్పద మార్పులు ఉంటే దయచేసి పోలీసులకు తెలపాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేఖ దినోత్సవం సందర్భంగా మాదకద్రవ్య వ్యతిరేక నవ సమాజ నిర్మాణం చేపడుదామని, గ్రామీణ యువత మాదక ద్రవ్యాల భారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్ధని, ఇందుకోసం యువతకు అవగాహన కల్పించాలని కుప్పం ముఖ్యమంత్రి పర్యటనలో వున్న ఎమ్మెల్యే పులివర్తి నాని సెల్ ఫోన్ ద్వారా అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యసనంగా మారి పలు రకాల నేరాలకు దారీ తీస్తున్నందున యువత వాటి వినియోగానికి దూరంగా ఉండటం శ్రేయస్కరమని తెలిపారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగించే వారు అనారోగ్యం పాలై జీవితాలను నాశనం చేసుకుంటే, వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నందున యువత భాధ్యత గల నడవడిక, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. గత పాలకులు చేసిన స్వార్థపూరిత కార్యక్రమాల వలన యువత భవిష్యత్తు మత్తు పదార్థాలతో అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు
మాదకద్రవ్యాల నిర్మూలనకు తీసుకునే చర్యలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. చంద్రగిరిని మత్తు పదార్థాల రహిత నియోజకవర్గం తీర్చిదిద్దటానికి అందరూ కృషి చేద్దామన్నారు. ఇందుకోసం పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

