వైసిపి కంచుకోట మల్లేపల్లి గ్రామం. వైసీపీ ఇంచార్జ్ తోట నరసింహం
గండేపల్లి . ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేసిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి తోట నరసింహం అన్నారు.గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారి ప్రక్కన గల శుభప్రధ్ కళ్యాణ మండపం నందు అన్నపరాజుపేట వైయస్సార్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తోట నరసింహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపికి కంచుకోటగా మల్లేపల్లి గ్రామం ఉండేదని, ఇక్కడ ప్రజలకు నేనంటే అభిమానం అని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఒకపక్క సంక్షేమం మరో ప్రక్క అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి నవరత్న పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా సీఎం పని చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని చాలా వరకు ఇల్లు నిర్మించడం జరుగుతుందన్నారు.

జగ్గంపేట నియోజవర్గంలో పలు చోట్ల ఇళ్ల స్థలాల కొరత ఉందని, ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. తోటరాంజి మాట్లాడుతూ మాకు అత్యంత ఆప్తుడైన చెరుకూరి ఆనంద్ మృతి చెందడం మాకు చాలా బాధాకరం అన్నారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు మా కుటుంబo ఎప్పుడు అండగా నిలుస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యువ నాయకులు తోటరాంజి, ఎంపీపీ చలగళ్ళ దొరబాబు, వైస్ ఎంపీపీ బిట్రా వెంకటలక్ష్మి రమణ, సొసైటీ అధ్యక్షులు బిట్రా గిరిబాబు, బత్తుల వీరబాబు, గొర్రెల శివ, బలిరెడ్డి శ్రీను, కలీం శివ, కర్రీ శివకృష్ణ, పడాల సత్యవతి, రామకుర్తి మూర్తి, కుంచే చినబాబు, కోర్పు దుర్గాప్రసాద్, తాళ్లూరి మధు కుమార్,మద్ది పట్ల రామకృష్ణ, ఎస్ఏ గఫూర్,పాము సూరిబాబు,పోకల సుబ్బారావు,సాని పిని తారకం, వైఎస్ఆర్సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.