Sunday, May 4, 2025

Creating liberating content

తాజా వార్తలుమహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి

మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి

పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు

టి.నరసాపురం.

నాలుగో విడత ఆసరా పంపిణీ కార్యక్రమం మండలంలోని వెంకటాపురం జడ్పిటిసి సామంతపూడి సూరిబాబు స్థలంలో జరిగింది సందర్భంగా పోలవరం శాసనసభ్యులు బాలరాజు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అక్కాచెల్లెళ్లకు నాలుగో విడత ఆసరా జగన్మోహన్ రెడ్డి వేశారని మహిళలకు పెద్దపీట వేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు పార్లమెంటు సభ్యులుగా కారుమూరి సునీల్ యాదవ్ పోలవరం శాసనసభ్యులుగా తన భార్య అయిన రాజ్యలక్ష్మి జగన్ మోహన్ రెడ్డి నియమించారని మహిళలు ఆశీర్వదించి తిరిగి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట అమలు చేసే వ్యక్తిని మహిళలు తమ జీవన ప్రమాణాన్ని పెంచుకునేలా సంక్షేమ పథకాలు మహిళలకు అందించారని అన్నారు విద్యార్థులకు విద్యకు 6000 కోట్లు ఖర్చుపెట్టి భావితరాలు అభివృద్ధి చెందేలా చేశారన్నారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలా అప్పు కోసం ఎదురుచూడకుండా అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలనేదే జగనన్న ఆశయమని అన్నారు గిరిజన నియోజకవర్గం పోలవరానికి రావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి అయినా తెల్లం రాజ్యలక్ష్మి సహాయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అక్కా చెల్లెమ్మల ఖాతాలో నేరుగా జగనన్న జమ చేస్తున్నారని మహిళలు అభివృద్ధి చెందితేనే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆర్థికంగా ఎదగగలుగుతారని అన్నారు దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతుందన్నారు బడుగు బలహీన వర్గాల జీవనోపాధి మారాలి అని మన కష్టాలు తీరి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే తిరిగి జగనన్న అధికారంలోకి రావాలని జగనన్న రుణం తీర్చుకునే సమయం వచ్చిందని కావున మహిళలందరూ జగనన్నను ఆశీర్వదించాలని అన్నారు ఈ సందర్భంగా 10 కోట్ల 79 లక్షల 13 వేల 408 రూపాయల చెక్కును డోక్రా మహిళలకు అందజేశారు ఆడదాం ఆంధ్రాలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థుల విద్యార్థులకు పథకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధారబోయిన లక్ష్మి జడ్పిటిసి సామంతపూడి సూర్యనారాయణ రాజు వైస్ ఎంపీపీ దివ్యభారతి మండల కన్వీనర్ శ్రీను రాజు జిల్లా రైతు విభాగం అధ్యక్షులు వాసిరెడ్డి మధు దేవరపల్లి ముత్తయ్య పిన్నమనేని చక్రవర్తి దాసరి రాంబాబు తుమ్మూరి శ్రీనివాసరెడ్డి బండి సుబ్బారావు ఎంపీటీసీలు సర్పంచులు అన్ని శాఖల అధికారులు వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article