భవానిపురం సిఐ ఉమామహేశ్వరరావు కామెంట్స్..
బాధ్యతాయుతమైన పౌరులుగా పోలీసులకు సహకరించండి..

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం..
సురక్షితమైన నూతన సంవత్సర వేడుకల కోసం భవానిపురంపోలీస్ వారి సూచనలు,
వస్తున్న 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరూ సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము..
శాంతిభద్రతల దృష్ట్యా మరియు మీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ క్రింది నిబంధనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరుతున్నాము..
1) రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేయడం అతివేగంగా వాహనాలు నడపడం మరియు బైక్ రేసింగ్‌లకు పాల్పడటం చట్టరీత్యా నేరం..
2) మద్యం సేవించి వాహనాలు నడపవద్దు..
1) 31వ తేదీ రాత్రి భవానిపురం స్టేషన్ పరిధి అంతటా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించబడతాయి..
2) నిబంధనలు అతిక్రమిస్తే వాహనాల జప్తు మరియు కఠినమైన చర్యలు తీసుకోబడతాయి..
3) 31వ తేదీ రాత్రి అనవసరంగా రోడ్లపై తిరగడం మానుకోండి..
వీలైనంత వరకు వేడుకలను మీ ఇళ్లలోనే జరుపుకోవాలని సూచిస్తున్నాము..
4) నూతన సంవత్సర వేడుకలు ఈవెంట్స్ లేదా పార్టీలు నిర్వహించాలనుకునే వారు పోలీస్ స్టేషన్ నుండి ముందస్తు అనుమతి (Police Permission) తీసుకోవడం తప్పనిసరి..
5) అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో లేదా కాలనీల్లో డీజేలు ఏర్పాటు చేయడం నిషిద్ధం..
ధ్వని కాలుష్య నియమాలను ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్స్ సీజ్ చేయబడతాయి..
6) నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాలు వాడినా సరఫరా చేసినా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి..
మీ సంతోషం మీకు మీ కుటుంబానికి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు..

