అధ్యక్షునిగా బల్లారపు రామాంజనేయులు
వేంపల్లె
ఏఐటియూసి అనుబంధమైన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. మంగళవారం కడపలోని కేంద్ర కార్యాలయంలో ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బల్లారపు రామాంజనేయులు, ఉపాధ్యక్షుడిగా చల్లా బాలాజీ, కోశాధికారిగా నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరూ వేంపల్లెకు చెందినవారు కావడం విశేషం. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, పెండింగ్ క్లెయిమ్స్ వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యవర్గ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగన్న, బుజ్జి, శ్రీను, మల్లికార్జున, బాలగంగులు తదితరులు పాల్గొన్నారు.

