బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన ఐదేళ్ల చిన్నారి కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పేశారు. కన్నబిడ్డ శాశ్వతంగా దూరమవుతాడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గంగాస్నానంతో అద్భుతం జరగొచ్చన్న చివరి ఆశతో చిన్నారికి నదీస్నానం చేయించగా బాలుడు దుర్మరణం చెందాడు. హరిద్వార్‌లో బుధవారం వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారి తీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.