Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుబోగస్ ఓట్లపై విచారణ జరిపించండి

బోగస్ ఓట్లపై విచారణ జరిపించండి

పరిపాలన అధికారికి వైఎస్సార్సీపీ నాయకుల వినతి

పులివెందుల
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో నమోదైన బోగస్ ఓట్లను విచారించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ కార్యాలయంలో డీ ఏవో రవికుమార్ కు పులివెందుల మున్సిపల్ వైసీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, వైస్ చైర్మన్ హఫీజ్, జెసిఎస్ ఇన్చార్జులు పార్లపల్లి కిషోర్, చంద్రమౌళి, లు సోమవారం వినతి పత్రం అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరునామాతో సంబంధం లేని కొత్త వ్యక్తులను ఓటర్లుగా నమోదు చేశారని వాటిని నమోదు చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. మున్సిపాలిటీ పరిధిలో దొంగ ఓట్లు విచ్చలవిడిగా ఎక్కించడం జరిగిందని ఓట్లు ఎక్కించేందుకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు సంపత్,నాగరాజు,సుభాష్, ప్రశాంత్, తదితర వైకాపా నాయకులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article