విజయవాడలోధర్నాకు మద్దతుగా కడపలో ధర్నా
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ కడప సిటీ:బేవరేజ్ హమాలీలకు ఎగుమతి కూలీ రేట్లు పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్చేశారు.మంగళవారం విజయవాడలో హమాలీ కార్మికుల ధర్నాకు మద్దతుగా కడప పాత బస్టాండ్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగుమతుల కూలీ రేట్లు పెంచాలని ఈ నెల 5 వ తేదీన విజయవాడలో ఏపీ ఎస్ బి సి ఎల్ ఎండి కార్యాలయం ఎదుటధర్నానిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎగుమతి కూలి రేట్ల ఒప్పందం 2023, అక్టోబర్ 31 తో ముగిసిందని పేర్కొన్నారు. ఏపీ ఎస్ బి సి ఎల్ యాజమాన్యం కొత్త మద్యంరవాణాఒప్పందదారులతో కూలి రేట్లునిర్ణయించకుండా ఆలస్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా ఎగుమతి కూలీ రేట్లు పెంచి హమాలీలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, ఎన్ ఆర్ సి జేఏసీ నాయకులు బాబు భాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి లక్ష్మీదేవి, కవిత,డివైఎఫ్ఐ నగర కార్యదర్శి ఓబులేసు, హమాలి యూనియన్ నాయకులు వెంకటరమణ, రెడ్డి ప్రసాదు, వెంకటసుబ్బయ్య, తిమ్మయ్య పాల్గొన్నారు.