Thursday, May 1, 2025

Creating liberating content

టాప్ న్యూస్బియ్యం మాఫీయా గాళ్లకు కళ్లెం వేయలేరా…!

బియ్యం మాఫీయా గాళ్లకు కళ్లెం వేయలేరా…!

*మాఫీయా గుట్టువిప్పితే దాడులు చేసినా పట్టించుకోరా..?
*డాన్,డాన్ సైన్యమంటూ సోసియల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే..
*తిరువూరులో దాడి చేసినా దండన లేక పోయే…
*పేదవాడి బియ్యం పట్టుబడిన చర్యలు సూన్యమే…
*లారీలకు లారీలు పట్టుబడుతున్నా ఉలుకు పలుకు లేకపోతుంటే..
*రేషన్ మాఫీయా అన్నది ఉన్మాదం లా ఉంటుంటే…
*పేదవాడి పేరు చెప్పి పంది కొక్కుల పాలు చేస్తుంటే…
*నిఘా వ్యవస్థ లు చేస్టలుడిగి ఉన్నాయా…
*ప్రభుత్వ జీతాలు ఇచ్చేది దేనికోసం…
*పేదవాడి పొట్ట కొట్టడానికా ఈ పెద్ద పెద్ద అధికార యంత్రాంగం ఉండేది…
*సమాచారం ఇస్తేనే పట్టుకుంటారా…
*లేదంటే సంచులు నింపుకునే పనిలో ఉంటారా…?
*షిప్ ను సీజ్ చేస్తే సరుకు ఆగిపోతుందా…
*మాఫీయా గాళ్ల మామూళ్ల మత్తు అంత బాగుందా…
*45 రూపాయలు పెట్టి ఉచితం ఇస్తే…
*ఏనిమిది రూపాయలకు అమ్ముకుంటున్నారంటే…
*లోపం ఎక్కడుంది…ఆచరణలో నా..అమలు లోనా..
*సైకిల్ దొంగకు ఉన్న శిక్ష బియ్యం దొంగకు లేకపోయేనే..
*కడుపు కోసం కన్నం వేస్తే కట కటాల పాలు అవుతుంటే ..
*కోట్ల కోసం కోటా బియ్యం కొల్లగొడుతుంటే కనిపించదా…

  • సొంత డబ్బా కోసం మీడియా కావాలి…
  • అదే మీడియాలో కథనాలు రాస్తే కళ్ళకు గంతలు కట్టుకుంటారా…
  • గన్నీ బ్యాగులతో దొరుకుతుంటే ఆడ్డుకట్ట వేయలేక పోతుంటే…
  • ఈ అధికార వ్యవస్థ గాడి తప్పలేదంటారా…
  • గూండాలకు గులాం గిరి చేసే గవర్నమెంట్ అధికారులు అవసరమా…
  • గరీబోడికి గుప్పెడు మెతుకులు కూడా ఇవ్వలేరా..
  • ఇదేమి ప్రభుత్వం…ఇంకెందుకు ఈ అలసత్వం…
    (రామ మోహన్ రెడ్డి,సంపాదకులు)
    “లచ్చులో లచ్చన్నా…
    ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
    ఎయ్…
    అరెరరె లచ్చులో లచ్చన్నా
    ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
    లచ్చులో లచ్చన్నా
    ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
    లచ్చులో లచ్చన్నా ఏయ్..”అని ఒసేయ్ రాములమ్మ సినిమా లో వందేమాతరం శ్రీనివాస్ వినిపించిన విదంగా నేడు ఈ బియ్యం మాఫీయాగాళ్ల చేతిలో పేద ప్రజల జీవితాలు కూడా ముష్టి బ్రతుకులు గా మారుతున్నాయి.గుమస్తా నుంచి మాఫీయా గా ఒకడు మారితే ఇంకొకడు రౌడీయిజం చేస్తూ గుండా గిరి లాగా దాడులకు దిగుతూ పట్ట పగలు పెద్ద పెద్ద లారీలతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటే చేతకాని అధికార వ్యవస్థ లు చేస్తాలుడిగి పోతుంటే ఈ బియ్యం మాఫీయా గాళ్ళు చెలరేగి పోతు పేదవాడి పొట్టకొట్టి బ్రతుకుతూ ఉన్నారు.డాన్ లంటూ ప్రచారం, యువగలం అంటూ సోసియల్ మీడియాలో చక్కర్లు కొట్టిస్తూ చిల్లర వేషాలకు దిగుతున్న సంబందిత అధికారులు చూస్తూ మౌనంగా ఉన్నారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి.
    దార్శనికుడు,ప్రతిపేద వాడు కూడా ఆర్థిక స్థిరత్వం పొంది ఆర్థిక అసమానతలు లేకుండా ఉండాలనే అకుంఠిత దీక్షతో అలుపెరగని పోరాటం చేస్తూ అన్నామో రామచంద్ర అని ఏ ఒక్కరూ కూడా అలమటించ కూడదని అనునిత్యం కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్త శుద్దిని కూడా శంకించే విదంగా ప్రభుత్వం లో ఉన్న కొంత మంది అధికారులు పేదల బియ్యం పంది కొక్కుల్లాగ పై దేశాలకు తరలిస్తుంటే పట్టుంచుకున్న పాపాన పోలేదు అన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు.
    ప్రజాప్రతినిధులు సైతం పిడిఎస్ రైస్ లో భాగస్వామ్యం అయ్యి తమ అనుయాయులతో వాటాలు తీసుకుంటూ తమకు అనుకూలంగా ఉన్న డీలర్ల ను కాపాడుకుంటూ డిపోలనుంచే గన్నీ బ్యాగులతో తరలిస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
    అక్రమ రవాణాలో పట్టుబడి రేషన్ మాఫీయా గాళ్ళు యథేచ్ఛగా బీరాలు పలుకుతూ సోసియల్ మీడియా వేదికగా డాన్, డాన్ సైన్యం అంటూ ప్రచారాలు చేసుకుంటున్న కూడా ఈ నీతి లేని అధికారులకు ,నిద్రమత్తులో ఉన్న నిఘా అధికారులకు కనిపించడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    గత ప్రభుత్వం హయాంలో అన్ని ఘోరాలు జరిగాయని అంటున్న కూటమి నేతలకు తమ కళ్లెదుటే ఖరీదయిన వాహనాలలో కొరియర్ వ్యాన్ లాగా కవరింగ్ చేసుకుని కోటా బియ్యం కొల్లగొడుతున్న కనిపించడం లేదా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
    గత కొన్ని రోజుల క్రితం పట్టుబడ్డ బియ్యం స్మగ్లర్ కు చెందిన గొడౌన్ కు తాళాలు వేసిన విజిలెన్స్ సీఐ కే తెలియకుండా గొడౌన్ తాళాలు పగలగొట్టి బియ్యం తరలిస్తుంటే పట్టుబడితే తీసుకున్న చర్యలు ఏమాత్రం పాలించాయన్నది ఆలోచన చేయాలి.నాడు తీసుకున్న చర్యలు గట్టిగా ఉంటే రెండోసారి ఇలా బియ్యం అక్రమ రవాణా చేసేవారు కాదు కదా అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
    ప్రభుత్వం పేద ప్రజల కోసం కిలో బియ్యం 45 రూపాయల వరకు ఖర్చుచేసి ఉచితంగా పంపిణీ చేస్తుంటే అదే బియ్యం 8 రూపాయలకు అమ్ముకునే స్థితికి దిగజారి పొతున్నారా లేక ఆ విదంగా ఈ బియ్యం కేటుగాళ్లు పేద ప్రజలను మభ్య పెడుతున్నారా అన్నది అర్థం కావడం లేదు.అలా పేదల బియ్యం అతి తక్కువ కు కొనుగోలు చేసి వాటికి పాలిష్ చేసి పరాయి దేశాలకు,పరాయి రాష్ర్టాలకు తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్న తీరు తెలిసి కూడా మొదలు వదిలి చిట్టచివరికి పోయి సీజ్ ద షిప్ అంటే ఉపయోగం ఏమాత్రం ఉందొ తెలియాల్సిన అవసరం ఎంతయినా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
    ప్రభుత్వ ఉదాసీనత అవినీతి అధికారుల అండదండలు, నిద్రమత్తులో ఉన్న నిఘా వ్యవస్థ, తమకు అన్నీ తెలిసినా మౌనంగా ఉంటున్న విజిలెన్స్ ,ఏ డీలర్,ఏ ఎండియు వాహనాలు ఏ గోడౌన్ లోని బియ్యం ఏ ప్రవేటు గొడౌన్ కు తరలిస్తున్న పూర్తిగా తెలిసిన సీవిల్ సప్లై అధికారుల చేతివాటం తో చిన్న చిన్న వాహనాలతో పెద్ద పెద్ద వాహనాల వద్దకు తరలించి పేదల బియ్యం గద్దల్లా తన్నుకు పోతుంటే పేదవాడు చూస్తూ ఉండి పోతున్నాడే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి ఉండిపోతున్నాడు.
    తిరువూరు లో బియ్యం అక్రమ రవాణా ను అడ్డుకోబోయిన పాత్రికేయుడిపై పైశాచికంగా దాడిచేసిన ,చాట్రాయి లో గ్రామ ప్రజలే బియ్యం లారీని పట్టించిన,పటమటలో గన్నీ బ్యాగులతో పట్టుకున్న ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి బుకాయిస్తున్నారని తెలుస్తుంటే ఇక వీరి ఆగడాలకు కళ్లెం వేసేదేవరు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    ఈ బియ్యం మాఫీయా గాళ్ల వెనుక అరాచక శక్తులు ఉన్నాయని కథనాలు రాసీన నోట్ల కట్టలతో ప్రబుత్వ యంత్రాంగం ను కొనుగోలు చేశామని బాహాటంగా నే అంటుంటే పేదవాడు మరింత పేదవాడి లాగానే పొట్టకూటి కోసం తిప్పలు పడక తప్పదేమో అన్న మీమాంసకు పరిస్థితులు దారితీస్తున్నాయి.
    ఒక సైకిల్ దొంగ,ఒక స్కూటర్ దొంగకు ఉన్న శిక్ష ప్రభుత్వ ఆశయాన్ని పేదవాడి బలహీనత ను ఆసరాగా చేసుకుని పిడిఎస్ బియ్యం ను అక్రమంగా తరలిస్తూ సమాచారం ఇస్తున్న వారిపై లేదా ఈ మాఫీయా గాళ్ల బాగోతం తెలిసిన వారిపైనే బరితెగింపుకు దిగేందుకుసిద్ధం అవుతున్నారనేది బహిరంగ సత్యం అయిన పోలీస్ పట్టించు కున్న పాపాన పోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇలంటి పరిస్థితి నుంచి పేదవాడి ఆకలిని తీర్చే వాడేవరన్నది ప్రశ్నగా మిగిలి పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article