Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుబిజెపి వైపు మొగ్గుతున్న గిరిజన యువత

బిజెపి వైపు మొగ్గుతున్న గిరిజన యువత

బుట్టాయగూడెం.
ఏజెన్సీ మండలాలలో గిరిజన యువత బిజెపి వైపు ఆకర్షితులై, ఆ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా ఆదివారం మండలంలోని పాలకుంటలో పోలవరం నియోజకవర్గం బిజెపి కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో కొంతమంది బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కొండేపాటి రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విధానాల పట్ల ప్రజలలో విశ్వాసం పెరిగిందని, దానికి నిదర్శనమే పార్టీలోకి జరుగుతున్న చేరికలని చెప్పారు. రానున్న కాలంలో పార్టీలోకి భారీ సంఖ్యలో చేరికలు ఉన్నట్లు ప్రకటించారు. నూతనంగా పార్టీలో చేరిన వారిలో ధర్ముల వెంకటేశ్వరరావు గతంలో ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో ఏబీవీపీ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసినట్లు తెలిపారు. కొత్తగా పార్టీలో చేరిన ధర్మల వెంకటేశ్వరరావును ఏలూరు జిల్లా గిరిజన మోర్చా కార్యదర్శిగాను, ధర్మల బాబురావుకు బుట్టాయిగూడెం మండల గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి గాను బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సోము హరి నారాయణ, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article