లేపాక్షి:
లేపాక్షి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి నరసింహనాయుడు బదిలీపై కర్నూలు జిల్లా కేంద్రానికి వెళ్లారు. ఎంపీడీవో బదిలీని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం మండల ఉపాధ్యక్షులు అంజన రెడ్డి తో పాటు పలువురు వైకాపా నాయకులు ఎంపీడీవో సిబ్బంది ఎంపీడీవో నరసింహనాయుడు కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంపీడీవో గా నరసింహనాయుడు వచ్చిన నాటి నుండి ప్రజలతో మమేకమై అభివృద్ధి పనులను కొనసాగించారన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బోర్ల అంజన్న రెడ్డి, సయ్యద్ నిసార్ అహ్మద్, ఇర్ఫాన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, పవన్ ,జనార్ధన్, వెంకటేష్, మురళి రెడ్డి, మంజు, ఈ ఓ ఆర్ డి శివన్న తో పాటు మండల పరిధిలోని కార్యదర్శులు పాల్గొన్నారు. అదేవిధంగా నంద్యాల జిల్లా నుండి లేపాక్షికి ఎంపీడీవో గా వాసుదేవ గుప్త త్వరలో రానున్నట్లు ఈ ఓ ఆర్ డి శివన్న తెలిపారు.