కదిరి
కదిరి రూరల్ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో గురువారం వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షులు
బత్తల హరి ప్రసాద్, సర్పంచ్ మణికంఠ నాయక్, వైకాపా నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. “ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి.. ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించండి” అని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, అన్ని వర్గాల అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం అన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి, వేయించి మక్బూల్ ను అసెంబ్లీకి, బోయ శాంతమ్మను పార్లమెంట్ కు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆదినారాయణ, బత్తల వెంకటరమణ, వైస్ ఎం.పీ.పీ, ఎంపీటీసీ అంజాద్, బాబు, శ్రీకాంత్, మహబూబ్, శీన నాయక్, బాలాజీ, శ్రావణ్, కిరణ్, రాజు బాబ్జన్, సోము, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

