కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పలి పుల్లయ్య
కడప సిటీ
కడప నగరం వ్యాప్తంగా ఫైర్ సేఫ్టీ లేని ఫ్యాక్టరీలు మాల్స్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చెప్పలి పుల్లయ్య డిమాండ్ చేశారు.
మంగళ వారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఫైర్ సేఫ్టీలు మెజర్మెంట్స్ పాటించకుండా, కార్మికుల ప్రాణాలు రిస్క్ లో పెడుతున్న యాజమాన్యాలపై అధికారులు కొరడా జులిపించాలని ఆయన అన్నారు.ఏదో ఒక ప్రమాదం జరిగితే తప్ప అధికారులు ఇన్స్పెక్షన్ చేసి ఫ్యాక్టరీలు కానీ, మాల్స్ కానీ ,హాస్పిటల్స్ కానీ వాటి పైన చర్యలు తీసుకునే దాఖలాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదో ఒకటి జరిగి అందులో పని చేస్తున్న కార్మికుల ప్రాణాలు పోతే తప్ప మీరు స్పందించరా అని ప్రశ్నించారు.నగరంలో ఉన్న ఫ్యాక్టరీలు మాల్స్లో కనీసం 40% అన్నా ఫైర్ సేఫ్టీలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.ఇప్పటికైనా అధికారుల స్పందించి ఫైర్ సేఫ్టీలు పాటించని ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.మీడియా సమావేశంలోకార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్, టాక్సీ యూనియన్ స్టేట్ కోఆర్డినేటర్ హబీబుల్లా, జిల్లా నాయకులు
ఇమ్రాన్, అనిల్, సాయి, బాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.