Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుఫిరాయింపు ఎమ్మెల్సీలకు లాస్ట్‌ ఛాన్స్‌

ఫిరాయింపు ఎమ్మెల్సీలకు లాస్ట్‌ ఛాన్స్‌

విజయవాడ: ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. అనర్హత పిటిషన్‌పై శాసనమండలి ఛైర్మన్‌ నోటీసులు జారీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలకు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 5న తుది విచారణకు హాజరుకావాలని శాసనమండలి ఛైర్మన్‌ నోటీసులు జారీ చేశారు.
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని మండలి చైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article