Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలుఫిబ్రవరి 5 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఫిబ్రవరి 5 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే ప్రవేశ పెట్టనున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరుగుతుంది.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఎన్నికలు జరిగే సంవత్సరంలో ప్రవేశపెడతారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఖర్చుల కోసం అవసరమైన నిధులను కాన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకుంటారు. దీనికి ఆమోదం తెలపడం కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్స్ నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. టీడీపీ, జనసేనలు పొత్తులో బరిలోకి దిగబోతున్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్ గా పోటీ చేయబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచార రంగంలోకి దూకాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article