హిందూపురంటౌన్
హిందూపురం నియోజక వర్గంలో మూడో రోజు మంగళవారం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. పట్టణ పరిధిలోని కొట్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉద్యోగులు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు సంబంధించి మొత్తం 1986 మంది ఓటర్లు ఉండగా ఇందులో మొదటి రోజు శనివారం 273, రెండో రోజు సోమవారం 332, మంగళవారం 799 ఓట్లు పోలింగ్ అయినట్లు ఆర్ ఓ అ భిషేక్ కుమార్ తెలిపారు. ఓట్లు వినియోగించుకునే ఉద్యోగులందరికి తగిన సౌకర్యాలను కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివ ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

