Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుప్రభుత్వ సాంఘీక సంక్షేమ కళాశాల బాలికల నూతన వసతి గృహాం ప్రారంభం…

ప్రభుత్వ సాంఘీక సంక్షేమ కళాశాల బాలికల నూతన వసతి గృహాం ప్రారంభం…

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి:ఎంపి కోటగిరి శ్రీధర్, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్.

కామవరపుకోట
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నట్లు ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ తెలిపారు. బుధవారం జంగారెడ్డిగూడెం కామవరపుకోట మోడల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సాంఘీక సంక్షేమ శాఖ మరియు కాలేజియేట్ ఎడ్యుకేషన్ తో నిర్మించిన ప్రభుత్వ సాంఘీక సంక్షేమ కళాశాల బాలికల నూతన వసతి గృహాన్ని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా పార్లమెంట్ సభ్యులు విద్యార్ధులనుద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పధకం ద్వారా పాఠశాలల అభివృద్ధితోపాటు విద్యాభివృద్ధికి ఎంతగానో కృషిచేసిందని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు వారి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉచిత విద్యాభోదనలు పొందవచ్చన్నారు.

జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పాఠశాలకు ప్రహరీగోడ ఏర్పాటు చేయడానికి ఎంపి నిధుల నుంచి రూ. 10 లక్షలు మంజూరుచేస్తారని తద్వారా ప్రహరీగోడను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విద్యకు కల్పిస్తున్న అనేక సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్ధులకు నాణ్యతగల విద్యను , భోజన వసతులు కల్పించాలని అన్నారు,ఈ కార్యక్రమానికి ముందు ఎంపి కోటగిరి శ్రీధర్, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కలిసి హాస్టల్ గదులను ఏర్పాటు చేసిన పర్నిచర్ ను పరిశీలించారు. అలాగే విద్యార్ధులతో ముఖా ముఖీగా మాట్లాడారు.కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జెడి భానుప్రకాష్, కళాశాల ప్రిన్సిపాల్ డా. విజయబాబు, వార్డెన్ అంజనా, స్ధానిక ప్రముఖులు విజయరాజు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article