Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుప్రభుత్వాసుపత్రికి వేడినీటి ప్లాంట్ వితరణ

ప్రభుత్వాసుపత్రికి వేడినీటి ప్లాంట్ వితరణ

హిందూపురం టౌన్
రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి ని పురస్కరించుకొని ఆదివారం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు వార్డుకు ప్రభాస్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో వేడి నీటి ప్లాంటును వితరణ చేశారు , ఈ ప్లాంట్ ను మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి, ప్రభాస్ అభిమాన సంఘం అధ్యక్షులు వెంకటేష్ రెడ్డి లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హీరోల అభిమానులు బ్యానర్లు కడుతూ హంగామా చేయడమే కాకుండా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయ మన్నారు ప్రభాస్ అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని, వీటిని కొనసాగించాలని కోరారు . అనంతరం ప్రభస అభిమానులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వినోద్ కుమార్, అభిమాన సంఘం ప్రతినిధులు మదన గోపాల్ రెడ్డి, యువ తేజ, ముసుఫా, శ్రవణ్,రఘు, ఫారూక్, రవి, నితిన్, మూర్తి, మధు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article