రాజ్యాంగ నిర్మాత అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేద్దాం…
మున్సిపల్ కమీషనర్ వాసు బాబు……
సోషల్ వెల్పేర్ డిప్యూటీ డైరెక్టర్ జాఖీర్ హుస్సేన్….
కడప సిటీ :డా.బాబా సాహెబ్ అంబేద్కర్ నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని మున్సిపల్ కమీషనర్ వాసు బాబు అన్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ అధికారులు మాసాపేట బ్రిడ్జి పై ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్నిసర్వాంగసుందరంగా,ప్రత్యేకjపూలతోఅలంకరించారు.hమున్సిపల్ కమీషనర్ వాసు బాబు,సోషల్ వెల్పేర్ డి డి జాఖీర్ హుస్సేన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లౌకిక రాజ్య స్థాపనే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాంగ బద్దంగా హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ కే దక్కిందన్నారు. భారత జాతిని జాగృత పరిచిన ఆదర్శమూర్తి , మహోన్నత వ్యక్తి అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, న్యాయశాస్త్ర నిపుణుడు, ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రజ్ఞుడు, చరిత్ర కారుడు,రాజనీతి కోవిడుదుగా అంబేద్కర్ పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు. అంబేద్కర్ ఆశయాలను , సిద్ధాంతాలను స్ఫూర్తి గా తీసుకొని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి, వారి ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే వారికి నిజమైన గౌరవమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున,సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.