టిడిపి, జనసేన, బిజెపి కలిసికట్టుగా వచ్చిన మళ్లీ జగన్ మోహన్ రెడ్డినే సిఎం :ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా

పోరుమామిళ్ల:వైయస్సార్ చేయూత ద్వారా ప్రతి మహిళను లక్షాధికారిగా చేసి చూపిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. బుధవారం పోరుమామిళ్ల మండల పరిషత్ ప్రాంగణంలో పోరుమామిళ్ల మరియు బి. కోడూరు మండలం సంబంధించిన వైయస్సార్ చేయూత కార్యక్రమానికి ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి, ఏపి ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి, ఆప్కాస్ట్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ఎలక్షన్లకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మహిళను లక్షాధికారులను చేస్తానని చెప్పడం చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హత కలిగిన ప్రతి మహిళా అకౌంట్లో లక్షలాది రూపాయలు నేరుగా వేయడం జరిగిందని డ్వాక్రా రుణమాఫీ నాలుగు తపాల్లో పూర్తిగా వేయడం జరిగిందని సున్నా వడ్డీ పూర్తిగా ఇవ్వడం జరిగిందని ఇప్పుడు జగనన్న చేయూత ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి వేయడం జరిగిందని మొత్తం ఒక్కొక్కరికి ఈ నాలుగు సంవత్సరాల్లో 75000 జమ చేయడం జరిగిందని గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా సంక్షేమ పథకాలు చెప్పిన మాట ప్రకారం ఇవ్వలేదని 2014లో నారా చంద్రబాబు ఎలక్షన్లకు ముందు 660 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చలేదని ఇప్పుడు మళ్లీ ఆరు హామీలని ప్రజలను మోసం చేసే దానికి మళ్లీ వస్తున్నారని ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ బిజెపి అందరూ కలిసి జగనన్నను ముఖ్యమంత్రి కాకుండా చేయాలని అదేవిధంగా పరోక్షంగా కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు అందరూ కలిసి జగనన్నను ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాకుండా చేయాలని సిద్ధాంతాలు లేకుండా కేవలం ప్రజలకు ఎల్లో మీడియా ఎల్లో పత్రికలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారని కానీ ప్రజలకు జగనన్న చేసిన మేలు ఎన్నటికీ మరువని కులం మతం ప్రాంతం ఓటు వేసావా లేదా అని లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని జగనన్న రాకపోతే సచివాల వ్యవస్థ సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోతాయ ని కావున మహిళలందరూ కచ్చితంగా జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, వైస్ ఎంపీపీ సి. భాష, మాజీ జెడ్పిటిసి దేశాయ్ శారదమ్మ, మాజీ ఎంపీపీ ఈశ్వరమ్మ, రంగసముద్రపు సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు వెంగళరెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు ఏపీ డి సుబ్బారెడ్డి వెలుగు సిబ్బంది డాక్రా మహిళలు సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుని రిజిస్ట్రేషన్ అయిన వారికి రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
