Tuesday, November 11, 2025

Creating liberating content

తాజా వార్తలుప్రతి కార్యకర్త సైనికుడు లాగా పని చేయాలి

ప్రతి కార్యకర్త సైనికుడు లాగా పని చేయాలి

రాబోవు రోజులు మళ్లీ మనవే

మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి

పులివెందుల
ప్రతి కార్యకర్త సైనికుడి లాగా పనిచేయాలని, రాబోయే రోజులు మళ్లీ మనవే అని మున్సిపల్ ఇంచార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, అన్నారు.బుధవా రం పులివెందుల మునిసిపాలిటీ పరిధిలోని పెద్ద రంగాపురం (సారాయి పల్లి) గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మునిసి పల్ ఇంచార్జి వై యస్ మనోహర్ రెడ్డి, చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హాఫిజ్,మునిసిపల్ కమిషనర్ రమణా రెడ్డి, జే సి ఎస్ ఇన్చార్జులు పార్నపల్లి కిషోర్, చంద్రమౌళి కౌన్సిలర్ చంద్ర, గ్రామ వైకాపా నాయకులు, పురుషోత్తం రెడ్డి, ప్రతాప్ రెడ్డి,రామ లక్ష్మణ్ రెడ్డి,చెన్నకృష్ణారెడ్డి లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించింది అన్నా రు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాల కు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే అన్నారు.కులం చూడం, పార్టీ చూడం, మతం చూడమని ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీల నే కాకుండా, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు . రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటే ప్రభుత్వ పథకాలు అన్ని అందు తాయన్నారు.175 కు 175 స్థానాలు గెలుపే ధ్యేయం గా ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడి రమణ, రాజేష్ నాయుడు,సిద్దయ్య,సంపత్, కో ఆప్షన్ నెంబర్ దాసరి చంద్రమౌళి, డేనియల్ బాబు, నగిరి గుట్ట నాగరాజు,శ్రీరాములు, సుంకుర రవి, కాలనీ రవి,సచివాలయం సిబ్బంది, అధికారులు, గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article