పేదలకు అండగా జగనన్న ఆరోగ్య సురక్ష
జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజల వద్దకే వైద్య సేవలు
గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి
ఆరోగ్యం అందరి హక్కు – 87 వార్డు వై.యస్.ఆర్.సీ.పీ ఇంచార్జ్ కోమటి శ్రీనివాస రావు
వడ్లపూడి -1 సచివాలయం పరిధిలో 250 మందికి వైద్య సేవలు

గాజువాక:గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి, కణితి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో జగనన్న ఆరోగ్య సురక్షశిభిరాన్ని ప్రారంభించారు.వడ్లపూడి సచివాలయం పరిధిలోని 250 మందికి, స్పెషలిస్ట్ డాక్టర్స్ పర్యవేక్షణలో వైద్య సేవలు అందజేశారు.ఈ సందర్బంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష తో పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో రాష్ట్ర ముజ్యమంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.87 వార్డు ఇంచార్జ్ ఇంచార్జ్ కోమటి శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రతి గడపకు ఉచితంగా వైద్య సేవలు అందజేయడం ద్వారా, ఆరోగ్యాన్ని ప్రజలందరీ హక్కుగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది డా. శివయ్య, 87 వార్డు ఇంచార్జ్, గాజువాక క్లస్టర్ -4 మండల అధ్యక్షులు బొడ్డ గోవింద్, కోమటి రమాదేవి, దుగ్గపు దానప్పలు, జెర్రిపోతుల ఈశ్వరావు, బొడ్డేటి మోదీనాయుడు, చిత్రాడ వెంకట రమణ, బెల్లంకొండ సీతారామ రాజు,కర్రీ అంజి, కాండ్రేగుల మనోహర్, వైద్య సిబ్బంది మెడికల్ సిబ్బంది డాక్టర్ శివయ్య, స్వరూప, దొరబాబు, గోపి, స్పెషలిస్ట్ డాక్టర్స్, సచివాలయం సిబ్బంది, ద్వాక్రా సీ. ఓ సూర్యనారాయణ, ఆర్.పీ లు, ఏ.యన్.యం లు, ఆశ వర్కర్స్, వాలంటీర్లు, గృహ సారధులు, వడ్లపూడి సచివాలయం పరిధిలోని ప్రజలు పాల్గొన్నారు.