వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష
వేంపల్లె
ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల వద్దకే మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపిపి ఎన్.లక్ష్మిగాయత్రీ, ఎంపిడిఓ దివిజ సంపతిలు పేర్కొన్నారు. 2 వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని స్థానిక 1వ సచివాలయంలో వారు ప్రారంభించారు. అనంతరం వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికోసం ప్రత్యేక వైద్య క్యాంపు ద్వారా ఆధునిక వైద్య సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే అవసరమైన వారికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా తమ అనారోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల వద్ద వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ స్వాతిసాయి, స్పెషలిస్ట్ వైద్యులు, ఇఓ సుబ్బారెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.