Sunday, November 16, 2025

Creating liberating content

తాజా వార్తలుప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే టిడిపి ప్రభుత్వ లక్ష్యం జ్యోతుల నెహ్రూ

ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే టిడిపి ప్రభుత్వ లక్ష్యం జ్యోతుల నెహ్రూ

ఏలేశ్వరం నుండి రింగ్ రోడ్డు మీదుగా వయా ఇర్రిపాక, నరేంద్ర పట్నం జగ్గంపేట కాకినాడ వరకు సర్వీసులు ఆర్టీసీ సర్వీస్ ప్రారంభం

జగ్గంపేట :ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కుటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏలేశ్వరం నుండి వయా నరేంద్ర పట్నం మీదుగా జగ్గంపేట కాకినాడ వరకు రింగ్ రోడ్డుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించారు. ముందుగా కిర్లంపూడి మండలం సోమవరం గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకుపచ్చ జెండా ఊపి బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. అనంతరం బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. రింగ్ రోడ్ లోగల గ్రామాలలో బస్సుకు థాంక్యూ సీఎం సార్, థాంక్యూ ఉప ముఖ్యమంత్రి సార్, థాంక్యూ ఎమ్మెల్యే సార్ అంటూ ప్లకార్డ్లతో స్వాగతం పలికిన నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి ట్రాన్స్ పోర్టు అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని ఇదే బస్సు ఈ రూట్ లో తిరిగే పరిస్థితి ఉండేదని కానీ గత ప్రభుత్వం ఈ బస్సులన్నిటిని రద్దు చేయడంతో సామాన్యులు ప్రయాణాలకు ఇబ్బంది గురవుతున్నారని ఉద్దేశంతో మళ్లీ సర్వీస్ పునర్దించామని ఆర్టీసీ అంటే లాభనష్టాలకు చూసుకోకుండా సామాన్యులకు అందుబాటులోకి తేవాలని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏలేశ్వరం నుంచి మొదలుకుని వయా య ర్రవరం, నరేంద్ర పట్నం, జగ్గంపేట మీదుగా కాకినాడ వరకు సర్వీస్ నడుస్తుందని అన్నారు. జనం బస్సులు ఎక్కే పరిస్థితిని బట్టి ఎన్ని బస్సులు అయినా వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం బస్ డిపో మేనేజర్ సత్యనారాయణ, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, చదరం చంటిబాబు, బుర్రి సత్తిబాబు, జంపన వెంకట సీతారామచంద్ర వర్మ, పాఠం శెట్టి మురళీకృష్ణ, మంచి కంటి శ్రీను, గంగిరెడ్ల దొరబాబు, బో దిరెడ్ల సుబ్బారావు సూతి శ్రీను, కంచి మణి బాబు, వేగి రామకృష్ణ, పెంటకోట సత్యనారాయణ, పేపకాయల బుజ్జి, కె, వీర్రాజు, కంచి కృష్ణ, రింగ్ రోడ్డు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article