వేముల :ప్రజలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రజలను కోరారు. మండలంలోని నల్లచెరువుపల్లి గ్రామాన్ని శనివారం సాయంత్రం సందర్శించిన ఎస్పీ గ్రామస్తులతో సమావేశమై ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎవరు కూడా ప్రలోభాలకు, బెదిరింపులకు భయపడవద్దని పోలీసులు అందరికీ అండగా ఉంటారని ఎవరైనా ప్రలోభాలకు గురిచేసిన భయపెట్టిన అట్టి వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అట్టివారిపై తీవ్ర చర్యలు ఉంటాయని కావున అందరూ ఎవరి ఓటును వారు వేసి తమ ఇండ్లకు చేరుకొని పోలింగ్ ప్రశాంతంగా వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో , ఆర్కే వ్యాలీ సిఐ గోవిందరెడ్డి,వేముల ఎస్సై ధనుంజయుడు,పోలీస్ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.