బుట్టాయగూడెం.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వని ప్రాధాన్యత పోలవరం నియోజకవర్గానికి ఇచ్చి అన్ని విధాల అభివృద్ధి చేశారని పోలవరం శాసనసభ్యుడు బాలరాజు అన్నారు. మండలంలోని తెల్లంవారి గూడెం, దొరమామిడిలలో మంగళవారం ఎమ్మెల్యే బాలరాజు, వైసిపి పోలవరం నియోజకవర్గ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి సంయుక్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తెల్లంవారి గూడెంలో సుమారు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు ఎమ్మెల్యే బాలరాజు శంకుస్థాపన చేశారు. తెల్లంవారిగూడెం, దొరమామిడిలలో రూ.80 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను, దొరమామిడిలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన బస్ షెల్టర్ ను బాలరాజు ప్రారంభించారు. ఇదే క్రమంలో దొరమామిడిలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాలగా వర్గోన్నతి పొందిన పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గం అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగానే యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేశారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో 170 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే వాటర్ ట్యాంకుల నిర్మాణం పనులు శరవేగంతో జరుగుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ఏ గ్రామంలోనైనా నీటి ఎద్దడి ఉంటే వెంటనే వాటర్ ట్యాంకులను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రామస్తుల సౌకర్యం కోసం తెల్లం వారి గూడెం, దొరమామిడిలలో రూ. 80 లక్షల వ్యయంతో అంతర్గత సిసి రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. వైసీపీ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం నుండి అవసరమైన నిధులను తీసుకువస్తామని అన్నారు. దొరమామిడి పంచాయతీ రాజకీయంగా తమ కుటుంబానికి పుట్టినిల్లని అన్నారు. పంచాయితీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో సర్పంచ్ తెల్లం రాముడు, జడ్పిటిసి మొడియం రామతులసి, ఎంపీపీ కారం శాంతి రమణ, వైస్ ఎంపీపీలు గుగ్గులోతు మోహనరావు, కుక్కల జయలక్ష్మి, వైసిపి జిల్లా సీనియర్ నేత, సొసైటీ అధ్యక్షుడు ఆరేటి సత్యనారాయణ, వైసిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు పాకిరం శ్రీనివాసరావు, వైసీపీ నేతలు కాళింగి వెంకటేశ్వరరావు, సోయం వెంకటరామయ్య, అట్లూరి రమేష్, కంభంపాటి నారాయణరావు, బొండు బాబు, ఈవోపీఆర్డి శ్రీహరి, పి ఆర్ ఏ ఈ రామాంజనేయులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మురళీకృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు

