ఊర్మిళానగర్ శ్రీ మాతా గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం దేవాదాయశాఖ ధర్మాదాయశాఖ సర్వ శ్రేయోనిధుల నుంచి రూ. 14 లక్షల 95 వేలతో చేపట్టిన అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటి రెడ్డి, నృత్య అకాడమీ డైరెక్టర్ భట్టిపాటి సంధ్యారాణి, భట్టిపాటి శివ, దేవాలయ నిర్వాహకులు కంది శ్రీనివాసరెడ్డి, కంది శివన్నారాయణ రెడ్డి, కంది శివా రెడ్డి, పువ్వుల కాంతారావు, బెవర నాగేశ్వరరావు, మాగం ఆత్మరామ్, దుర్బేసుల హుస్సేన్, మాదాల తిరుపతిరావు, కేసరి లక్ష్మి రెడ్డి , కె శ్రీనివాసులు, శివరామి రెడ్డి , కనకం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు