రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను మౌనంగా ఉంటున్నా..పొత్తు ధర్మం పాటించాలి..ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించకూడదు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేట, అరుకు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై తొలిసారిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదని, కానీ ఆ పార్టీ దానిని ఉల్లంఘించింది.. కాబట్టి తన పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతున్నానని శుక్రవారం ఆయన తన పార్టీ నాయకులతో మాట్లాడారు.
టీడీపీ సీట్లు అనౌన్స్ చేయడం తన పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసిందని.. లోకేష్ సీఎం పదవి గురించి కూడా మాట్లాడిన తాను పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే తాను మౌనంగా ఉంటున్నానని .. చంద్రబాబు సీనియర్ నేత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలా జరుగుతాయని..వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
జనసేన నేతలు ఇవన్నీ అర్దం చేసుకోవాలని కోరుతున్నా..జగన్ ప్రభుత్వం 2024 లో మళ్ళీ అధికారంలోకి రాకూడదనే తన కోరిక అని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ పై తన వ్యక్తిగత కక్ష లేదని ఆంధ్రప్రదేశ్ చాలా కష్టాల్లో కూరుకుపోయిందని అన్నారు. 5 ఏళ్ల జన సేన పోరాట బలం 2024 రాజకీయ బలం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఒక దశాబ్దం పాటు జన సేన పార్టీని సమర్థవంతంగా నడిపాం.. బీజేపీతో కలిసి ఉన్నారు, మైనారిటీలను ఎలా చూస్తారని కొందరు ప్రశ్నించారన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని.. ఎవరి మనోభావాలు దెబ్బ తిన కుండా సెక్యులరిస్ట్ గా ప్రశ్నిస్తానన్నారు. దోషులను పట్టుకోండి అంటే ఓ మతాన్ని కించ పరిచినట్లు కాదని అన్నారు. తన భార్య క్రిస్టియన్ అని, తాను హిందువనని అన్నారు. అలా అని తాను ఒకే మతం మాత్రమే ప్రోత్సహించే వ్యక్తిని కాదని .. తాను పరిపూర్ణ లౌకిక వాదినని పవన్ కల్యాణ్ అన్నారు.