Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుపెన్షన్లు పంపిణీకి డబ్బులు లేక చంద్రబాబుపై విమర్శలు

పెన్షన్లు పంపిణీకి డబ్బులు లేక చంద్రబాబుపై విమర్శలు

వృద్ధులను మోసం చేస్తున్న జగన్ సర్కార్ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దళిత ద్రోహి వైయస్ జగన్ పులివెందులలో బీటెక్ రవిని గెలిపిస్తాం ఎమ్మార్పీఎస్ నాయకులు

పులివెందుల :క్రమం తప్పకుండాఒకటవ తేదీన పంచే పింఛన్లకు డబ్బులు లేక తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్ర బాబు నాయుడు ఎలక్షన్ కమిషనర్లకు వాలంటీర్ల మీద ఫిర్యాదు చేయడం వల్లనే పింఛన్ డబ్బులు పంచలేక పోతున్నామని తప్పుడు ఆరోపణలు చేయడం వైకాపా నాయకులు మానుకోవాలని పులివెందులఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) పేర్కొన్నారు. సోమవారం ఆయన ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి టిడిపి కార్యాల యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వ త్రిక ఎన్నికలలో వైకాపా అధికారంలోకి రాదని తెలిసి ప్రభుత్వం వద్ద ఉన్న వేల కోట్ల డబ్బు అంతా సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఖజానా ఖాళీ చేసినది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే వాలంటీర్లను పక్కన పెట్టిన విషయం ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండి, ఒకటవ తేదీన పింఛన్ పంచాలని ఉద్దేశం ఉంటే సచివాల యం సిబ్బంది, గ్రామ కార్యదర్శులు,ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా ఒకటవ తేదీ పింఛన్లు, పంచవ చ్చు కదా అని ఆయన పేర్కొన్నారు. కానీ మీరు తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు ఆరోపణలు మానుకొని యుద్ధ ప్రాతిపదికన వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేసేచర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్న అన్నారు. పెన్షన్ పంపిణీ చేసేందుకు డబ్బులు ఉంటే సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. డబ్బులు లేకే చంద్రబాబుపై బురద జల్లుతున్నారన్నారు. ప్రజల అన్ని గమనిస్తూనే ఉన్నారని వృద్ధులను మోసం చేసిన ఘనత జగన్ కే దక్కింది అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆంక్షలు లేకుండా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేడు వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేయాల్సిం దే అని ఆయన డిమాండ్ చేశారు.దళితుల ద్రోహి ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మార్పీఎస్ నాయకు లు కే ఎన్ రాజు, చిన్న సుబ్బయ్య, మాతయ్య, లక్ష్మీదేవి లు అన్నారు. మందకృష్ణ మాదిగ సంపూర్ణ మద్దతు కూటమికే ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించకపోవ డం చాలా దారుణం అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఎస్సీలపై అత్యాచారాలు అనేకముగా జరిగాయి అన్నారు. చంద్రబాబుతోనే ఏబిసిడి వర్గీకరణ సాధ్యమవుతుందన్నారు.ఎస్సీలను నిట్టనిలువు నా మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి ఎస్సీ కాలనీలో తిరిగి బీటెక్ రవిని గెలిపించుకునే విధంగా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో దళితులు జగన్మో హన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా దళితులు కూటమికే మద్దతు పలకాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపినాయకుడు ఓబుల్ రెడ్డి యాదవ్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article