Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుపెండింగ్ కోర్ట్ కేసులను పరిష్కరానికి చర్యలు

పెండింగ్ కోర్ట్ కేసులను పరిష్కరానికి చర్యలు

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి.
  • అనంతపురము :పెండింగ్ ఉన్న కోర్ట్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి. ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో రెవెన్యూ లీగల్ మేటర్స్ పై ఆర్డీవోలు, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కోర్టు కేసులను రోజుకు ఒకటి చొప్పున వెంటనే క్లియర్ చేయాలని, కంటెంప్ట్ కోసం కేసులను కూడా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డివిజన్ వారీగా కోర్టు కేసుల పెండింగ్ ను జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కోర్టు కేసులను ప్రొసీజర్ ప్రకారం పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డీవోలు, తహసిల్దార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీవోలు, జి.వెంకటేష్ వి.శ్రీనివాసులురెడ్డి, రాణి సుస్మిత, కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు, తహసీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article