ప్రజాభూమి, విజయవాడ బ్యూరో:
విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ మిత్రుడు గొరుపర్తి (స్ఫూర్తి) శ్రీనివాస్ కి జాతీయ స్థాయి డాక్టర్ పట్టాభి సీతారామయ్య పురస్కారం లభించింది. డాక్టర్ పట్టాభి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ తూములూరి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ పురస్కారం గొరుపర్తి (స్ఫూర్తి) శ్రీనివాస్ అందుకున్నారు. ప్రకృతిలో మనతోపాటు సంచరించే చిరు ప్రాణం, రైతు నేస్తం పిచ్చుక ను కాపాడాలని వాటి సింగారి ముంగురులకు బంగారు రంగులద్ధాలనే తపనతో వాటి వయ్యారి నడకలకు విరిదండాలు వెయ్యాలనే ప్రతినతో పిచ్చుకను చేసుకుందామా మచ్చిక అనే నినాదంతో సేవ్ స్పారో ఉద్యమాన్ని నిర్వహించి చిన్నారుల నుంచి పండు ముదుసలి వరకు చైతన్యాన్ని తీసుకువచ్చిన శ్రీ నివాసకు అవార్డు రావడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. శుక్రవారం గుంటూరు అరండల్ పేట, సీ.పి.ఎమ్ కార్యాలయంలో డాక్టర్.పట్టాభి కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో త్యాగరాజ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడలు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, లవకుశ చిత్రంలో కుశుడు పాత్రధారి వుయ్యూరి నాగసుబ్రహ్మణ్యం, విశ్రాంత ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్ శ్రీ కే.హరిబాబు, విశ్రాంత డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎగ్జిమ్ బ్యాంకు, ముంబాయి బొమ్మన రమేష్ బాబు, సెక్రటరీ కరస్పాండెంట్ లయన్స్ మాంటిస్సోరి హైస్కూల్ ముద్దన నాగరాజకుమారి, ప్రముఖ నాటక రచయిత నంది అవార్డు గ్రహీత కావూరు సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు, ఈ జాతీయ స్థాయి పురస్కారం పిచ్చుకల సంరక్షణ పై తన బాధ్యతను మరింత పెంచిందని మున్ముందు మరిన్ని అవగాహననా సదస్సులు, ఆర్ట్ అండ్ ఫోటో కాంటెస్టులు, బర్డ్ హౌస్ లు పంచే కార్యక్రమాలు నిర్వహిస్తామని దానికి పక్షి ప్రేమికులు, పర్యావరణ సంరక్షకులు ముందుకు రావాలని శ్రీనివాస్ కోరారు.