Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుపారదర్శక, నిష్పాక్షికంగా సంక్షేమం అమలు - ఏపీ గవర్నర్ నజీర్

పారదర్శక, నిష్పాక్షికంగా సంక్షేమం అమలు – ఏపీ గవర్నర్ నజీర్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణకు ముందు సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి నివాళులు అర్పించారు. పేదరికం, సామాజిక అసమతుల్యతపై పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది..భిన్నత్వంలో ఏకత్వం, సోదరభావంతో భారత గణతంత్రం మనుగడ సాగిస్తోంది.. అందరికి సమాన అవకాశాలు కల్పించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
ఏపీ రాష్ట్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఈ క్రమంలో ప్రజల సహకారం మరువ లేనిదని చెప్పారు. వారం క్రితమే 206 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని సోషలిజం, సెక్యులరిజం, గణతంత్ర రాజ్య భావనల స్ఫూర్తిగా నెలకొల్పినట్టు చెప్పారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.ప్రజా సంక్షేమం, ప్రజల అవసరాలను గుర్తించేలా పథకాలను తీర్చిదిద్దినట్టు చెప్పారు.ఖచ్చితమైన, పారదర్శకమైన సంక్షేమ పథకాలను అమలు చేయడమే లక్ష్యంగా 56నెలల పాలన సాగిందని చెప్పారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ఉద్దేశాలు, ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించినట్లు చెప్పారు.
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే విలేజ్ హెల్త్‌ క్లినిక్స్‌, వ్యవసాయ అవసరాలు తీర్చేలా రైతు భరోసా కేంద్రాలు, విద్యాబోధనలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు 56703 స్కూళ్లలో 17,805 కోట్లతో నాడు నేడు కార్యక్రమాలను అమలు …రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటుతో వర్క‌‌ ఫ్రం హోమ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ కూడా నేరుగా ఇంటి వద్దే పంపిస్తున్నాం…రేషన్‌ సరుకుల్ని 9260 మొబైల్ యూనిట్లతో ఇంటి వద్దే డెలివరీ ..ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో విద్యార్ధులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యారంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాలకు పిల్లల్ని పంపే ప్రతి తల్లికి ఏటా రూ.15వేల రుపాయలు చెల్లించి.. 83లక్షల మందికి లబ్ది కలిగిస్తున్నట్లు చెప్పారు.నాడు నేడు,విద్యాదీవెన, అమ్మఒడి, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలతో విద్యార్ధుల జీవితాలను మార్చే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ..ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, సిబిఎస్‌ఇ, ఐబి సిలబస్‌లతో విద్యార్ధుల జీవితాల్లో సమూల మార్పులు తెస్తుందని గవర్నర్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article