కామవరపుకోట
పల్లెకు పోదాం కార్యక్రమంలో ప్రతి గ్రామం నుండి బిజెపి పార్టీకి సంబంధించి ఇద్దరు సభ్యులను నియమిస్తున్నట్లు చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఏసు ప్రసాద్ చెప్పారు. భారతీయ జనతా పార్టీ పల్లెకి పోదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పల్లెకుపోదాం జిల్లా కో కన్వీనర్ జీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఇద్దరు సభ్యులను గుర్తించి రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాలన్నీ ఈ కమిటీ సభ్యులతో ప్రజలకు వివరించడం కోసం కమిటీ సభ్యులు పనిచేస్తారు అని వివరించారు. అసెంబ్లీ కన్వీనర్ ఒంటెద్దు యేసు వరప్రసాద్ మండలాధ్యక్షులు కుర్ర వెంకటసుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ మండల పల్లెకుపోదాం కార్యక్రమం కో కన్వీనర్ కొత్తూరు పుల్లయ్య సత్యనారాయణ కిషోర్ మొగల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

