ప్రధాని నరేంద్ర మోడీకి రేడియో గిఫ్ట్ గా పంపిన ఏపీ సి సి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
మోదీ పూజ చేసిన అమరావతి నిర్మాణం పదేళ్లయినా పూర్తికాలేదని విమర్శ
దేశవ్యాప్తంగా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ప్రధానిపై షర్మిల ఫైర్
కడప సిటీ :
బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో ఏపీసిసి ప్రెసిడెంట్ షర్మిల మాట్లాడుతూ మనకి బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడే మాటలకి బదులుగాఏపి ప్రజల మన్ కి బాత్ మీరు వినండి ఆమె అన్నారు.పదేళ్ల పాలనలో దేశంలోని అన్నివర్గాల వారినీ మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల చార్జిషీట్ విడుదల చేశారు. ప్రధానిగా మోదీ పది ఫెయిల్యూర్లను ఎత్తిచూపుతూ దీనిని రూపొందించినట్లు చెప్పారు. తిరుమల సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి ఏపీ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. కేంద్రంలో మోదీ పాలనలో ఏపీ తీవ్రంగా నష్టపోయి అన్నివిధాలుగా నాశనమైందని తీవ్ర విమర్శలు చేశారు. నాడు చంద్రబాబు, నేడు జగన్ కేంద్రంలోని బీజేపీకి అంటకాగుతూ విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలుపరచడంలో విఫలమయ్యారని చెప్పారు. మీకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదు,ముందు మీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పండి ఎందుకు అంటేపది ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్ళీ కపట ప్రేమ చూపిస్తున్నారుకాబట్టి.ఎన్నికల కోసం ఇన్ని సార్లు వచ్చిన మీరు ఏపీఅభివృద్ధి కోసం ఒక్కనాడైనా రాష్ట్రానికి వచ్చారా?మీపై ఏపి ప్రజల తరుపున ఛార్జ్ షీట్ ఇస్తున్నాంమీకు దమ్ముంటే ఏపి ప్రజలకు ఇప్పుడైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వండి.పది ఏళ్లలో మోడీ చేసిన మోసాలకు పది ప్రశ్నలు సందిస్తున్నాం వీటికి సూటిగా సమాధానం చెప్పి నైతిక హక్కు ఉందా లేదా అని మీరు ప్రశ్నించుకొని ఓట్లు అడగండి.నాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని, తర్వాత ఆ మాటమరిచిరాష్ట్రాన్నివెన్నుపోటుపొడిచారు. జగన్ రివర్స్ టెండెరింగును అడ్డుకోకుండా, పోలవరం ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికారు, ఎత్తుతగ్గించే కుట్రలుకూడాచేస్తున్నారు.మీచేతులమీదుగాభూమిపూజజరిపించుకున్న అమరావతి రాజధాని పదేళ్ల తర్వాత కూడా పూర్తికాలేదు.పోరాటాలు,ప్రాణార్పణ ద్వారా సాకారమైన విశాఖఉక్కును,అక్కడిసెంటిమెంటుకువిరుద్ధంగాఅమ్మేద్దామని చూస్తూ, మళ్ళీ విశాఖ మీదదొంగప్రేమఒలకబోస్తున్నారు.కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటివి, విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను తుంగలోతొక్కి, రాష్ట్రానికి తీవ్రమైనఅన్యాయం చేసారు.మీ దత్తపుత్రుడు మద్యం సిండికేటు నడుపుతూ, కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నా మీరు ఉలకలేదు, పలకలేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను అరెస్టు చేసారు, ఇక్కడ మాత్రం ఎటువంటి చర్యలు లేవు.దేశంలో ఎస్సీ, ఎస్టీల రేజర్వేషన్లను అంతం చేయటానికి పూనుకున్నారు, మరియు రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా, మీ కమీషన్లకు ఫిర్యాదులు చేస్తున్నా, మీరు రాష్ట్ర సర్కారునుప్రశ్నించలేదు, చర్యలకు ఉపక్రమించలేదు.ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమకాంట్రాక్టులు,దొంగదారిలో రాష్ట్రం చేస్తున్న అప్పులు, కేంద్రo ఇచ్చే నిధుల మళ్లింపు, ఇలా ఎటు చూసినా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నా, కేంద్రం నుండి ఎటువంటి చర్యలులేవు.కర్నూలులోఅవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐవచ్చి,చేతకాక,శాంతిభద్రతల సమస్యంటూ బెదిరి వెనుతిరిగింది. ఈ విషయంలో మీ సర్కారు మిన్నకుండి కూర్చోవటం యావత్ దేశానికే అవమానం.దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాటయిచ్చి, మాట తప్పి, దేశ యువతను, నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసారు.మోదీ గారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మన్ కి బాత్ లో మీరు ఖచ్చితంగా దోషఈ గడ్డ మీదఅడుగుపట్టిన ప్రతిసారి ఇక్కడి ప్రజలను క్షమాపణ కోరండి అని ఆమె సవాల్ విసిరారు.

