సానికొమ్ము తిరుపతి రెడ్డి తెలుగుదేశం పార్టీ
హనుమంతునిపాడు
మాజీ శాసనసభ్యులు కనిగిరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 51వ జన్మదిన వేడుకలు హనుమంతునిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు హనుమంతునిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఉదయం 9:30 గంటలకు సర్వమత ప్రార్థనలు జరుగుతాయని 10 గంటలకు భారీ కేక్ కట్టింగ్ జరుగుతుందని తెలిపారు. అనంతరం అమరావతి గ్రౌండ్ కు వెళ్లి ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. కావున హనుమంతునిపాడు మండలంలోని 23 పంచాయతీల గ్రామపార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జ్ లు యూనిట్ ఇంచార్జ్ లు ఐటీడీపీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హనుమంతునిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 9 గంటలకు రావాలని కోరారు.