ఏలేశ్వరం:-నగర పంచాయతీ పరిధిలో కబేళ, మార్కెట్, రోడ్డు మార్జిన్ ఆశీలు వసూళ్లకు 2024-25 సంవత్సరానికి సంబంధించి వేలంపాట బుధవారం నిర్వహించుచున్నట్లు మేనేజర్ కే శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ బహిరంగ వేలం పాటలను నగర పంచాయతీ ఆవరణంలో కమీషనరు వారిచే గాని వారు అనుమతి పొందిన వారిచే గాని బుధవారం ఉదయం 11 గం.లకు నిర్వహించబడుతుంది అన్నారు. కావున
సాల్వేన్సీ, ధరావత్తు చెల్లింపు జరిపిన తదుపరి కబేళాలకు, మరియు రోజు వారి మార్కెట్టు, రోడ్డు మార్జిను నందు 2024- 2025 సం.మునకు
ఆశీళ్ళు వసూలు చేసుకునే హక్కు సొంతం చేసుకోవాలని చేసుకోవాలన్నారు.
కావున బహిరంగ వేలం పాటలో పాల్గొనేవారు ( ఔత్సాహికులు) పైన పేర్కొన్న విధంగా ఆఫీసు నకు సమర్పించి సదరు బహిరంగ వేలం పాటలను స్వంతము చేసుకోవాలని సూచించారు.