విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల సస్పెన్షన్ కు గురైన విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేశారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేడు లోక్ సభ స్పీకర్ తోనూ, రాజ్యసభ చైర్మన్ తోనూ మాట్లాడారు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రభుత్వం తరఫున కోరారు. అందుకు వారు అంగీకారం తెలిపారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో 11 మంది ఎంపీలపై, లోక్ సభలో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ తొలగిపోనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులోకి ఆగంతుకులు చొరబడిన ఘటనలో సదరు ఎంపీలు సభలో తీవ్ర ఆందోళనలు చేపట్టారు. దాంతో ఆ 14 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.

