ఏలేశ్వరం:-
కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రత్తిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, ఆంధ్రప్రదేశ్ కిసాన్ సెల్ కోఆర్డినేటర్ ఉమ్మడి వెంకటరావు పిలుపునిచ్చారు. ఈ మార్గాన్ని మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి వర్యులు శ్రీ ఎంఎం పళ్లంరాజు ఆదేశానుసారం మరియు ఆంధ్రపదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ వైయస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంటింట కాంగ్రెస్ కార్యక్రమం
నగర పంచాయతీ పరిధిలో ప్రముఖులు అయినటువటి ఐ ఓ సి డీలర్ తాళ్లూరి గొల్లాజి రావు, శ్రీ సూర్య విద్య సంస్థల చైర్మన్ సత్యనారాయణ, వర్తక సంఘం నాయకులు ఊర వెంకటేశ్వరరావు మరియు ఇతర ఇతర కుటుంబ సభ్యులను కలుసుకుని కాంగ్రెస్ పార్టీ కి ఓటు వెయ్యాలని రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధాని మంత్రిని చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి సెల్ చైర్మన్ మోఏటి సూర్య ప్రకాష్ రావు,ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పోతబత్తుల పెదబాబు తదితరులున్నారు.

