పోరుమామిళ్ల:
పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ పరిధిలోని సీనప్ప బావి వద్ద ఉన్న మెయిన్ బోర్ చెడిపోవడంతో పట్టణ ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు వెంటనే స్పందించి ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తూ యంత్రం సహాయంతో సమస్యను గుర్తించి వెంటనే పరిష్కారం చేసి ప్రజలకు నీటి సమస్య లేకుండా పరిష్కరించారు.. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ పరిధిలో ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు..