టి.నరసాపురం:ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి. మేరీ ప్రశాంతి, పోలవరం డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి ఆదేశాలపై శనివారం జీలుగుమిల్లి సీఐ క్రాంతి కుమార్ అద్వర్యము లో ఎస్ఐ దుర్గ మహేశ్వరరావు కు రాబడిన సమాచారం మేర ఎస్ఐ వారి యొక్క సిబ్బందితో కలిసి మండలంలో వెలగపాడు గ్రామములో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారాయి తయారీ కేంద్రం పై దాడులు నిర్వహించి గేలం యేసు ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 30 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకొని, 02 అల్యూమినియం డ్రమ్ము లలో 400 లీటర్ల బెల్లం ఊట ద్వంసం చేసి, సారాయి తయారీకి ఉపయోగించే సామాన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలియ చేసా రు.